దీని భావమేమి తిరుమలేశ?

అన్నమాచార్య సంకీర్తన – హిందోళ రాగం – ఆది తాళం

పల్లవి:

హరి రసమా విహారి సతు –
సరసోయం మమ శ్రమ సంహారి

చరణం 1:

దయా నిభృత తనుధారి సం
శయాతిశయ సంచారి
కయాప్యజిత వికారి
క్రియా విముఖ కృపాలధారి

చరణం 2:

పరామృత సంపాది
స్థిరానందాశ్రేది
వరాలాభ వివాది శ్రీ –
తిరువేంకటగిరి దివ్య వినోది

బాలమురళీకృష్ణ పాడిన అన్నమయ్య రచనలలో నాకెంతో ఇష్టమైన సంకీర్తన ఇది. సంస్కృతం లో ఉండడం వల్ల అర్ధం పూర్తిగా తెలియదు – ఎవరన్నా చెప్పగలిగితే ధన్యుణ్ణి.

Edit 03.24.07 – శ్రవణ్ సూచన చూశాక (comments లో) ఈ కీర్తన గురించి నాకు తెలిసిన మరికొన్ని వివరాలు: ప్రముఖ సంగీత-సాహిత్యకారుడు, అన్నమాచార్య నిపుణుడు ఐన డా. పప్పు వేణుగోపాలరావుగారి ప్రసంగం ఒకటి వినే మహద్భాగ్యం నాకు ఒకసారి కలిగింది. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ (ఈ కీర్తన కి హిందోళ రాగం కట్టిన వాగ్గేయకారుడు) పాడినది కొంచెం వినిపించి, అన్నమయ్య ఆధ్యాత్మిక సంస్కృత రచనలలో ఒకటిగా వివరించారు (ఇదే శ్రవణ్ పంపించిన snippet లొ వినవచ్చు). డా. వేణుగోపాలరావుగారి Flowers at his Feet – An Insight into Annamacharya’s Compositions నుంచి ఇంకొంచెం వివరాలు:

It describes Hari as a unique, omnipresent power who destroys the pain, compassionate, dispels doubts, handsome, who protects those who seek refuge in Him, who bestows happiness, boons and whose divine presence is found in the Venkatagiri. This seemingly simple song in Sanskrit is puzzling and gives us difficult time in understanding the song until we realise that the ten incarnations have been incorporated in this song by Annamacharya.

సారం గ్రహించవచ్చు కాని అసల ఆ సంస్కృత పదాలకు అర్ధం ఏమిటి, వాటి వాక్యానుగుణ తాత్పర్యం ఏమిటి తెలుసుకోవలనేది నా తపన. ఇది ఇంకా తీరని సందేహమే.

ప్రకటనలు