దీని భావమేమి తిరుమలేశ?

అన్నమాచార్య సంకీర్తన – హిందోళ రాగం – ఆది తాళం

పల్లవి:

హరి రసమా విహారి సతు –
సరసోయం మమ శ్రమ సంహారి

చరణం 1:

దయా నిభృత తనుధారి సం
శయాతిశయ సంచారి
కయాప్యజిత వికారి
క్రియా విముఖ కృపాలధారి

చరణం 2:

పరామృత సంపాది
స్థిరానందాశ్రేది
వరాలాభ వివాది శ్రీ –
తిరువేంకటగిరి దివ్య వినోది

బాలమురళీకృష్ణ పాడిన అన్నమయ్య రచనలలో నాకెంతో ఇష్టమైన సంకీర్తన ఇది. సంస్కృతం లో ఉండడం వల్ల అర్ధం పూర్తిగా తెలియదు – ఎవరన్నా చెప్పగలిగితే ధన్యుణ్ణి.

Edit 03.24.07 – శ్రవణ్ సూచన చూశాక (comments లో) ఈ కీర్తన గురించి నాకు తెలిసిన మరికొన్ని వివరాలు: ప్రముఖ సంగీత-సాహిత్యకారుడు, అన్నమాచార్య నిపుణుడు ఐన డా. పప్పు వేణుగోపాలరావుగారి ప్రసంగం ఒకటి వినే మహద్భాగ్యం నాకు ఒకసారి కలిగింది. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ (ఈ కీర్తన కి హిందోళ రాగం కట్టిన వాగ్గేయకారుడు) పాడినది కొంచెం వినిపించి, అన్నమయ్య ఆధ్యాత్మిక సంస్కృత రచనలలో ఒకటిగా వివరించారు (ఇదే శ్రవణ్ పంపించిన snippet లొ వినవచ్చు). డా. వేణుగోపాలరావుగారి Flowers at his Feet – An Insight into Annamacharya’s Compositions నుంచి ఇంకొంచెం వివరాలు:

It describes Hari as a unique, omnipresent power who destroys the pain, compassionate, dispels doubts, handsome, who protects those who seek refuge in Him, who bestows happiness, boons and whose divine presence is found in the Venkatagiri. This seemingly simple song in Sanskrit is puzzling and gives us difficult time in understanding the song until we realise that the ten incarnations have been incorporated in this song by Annamacharya.

సారం గ్రహించవచ్చు కాని అసల ఆ సంస్కృత పదాలకు అర్ధం ఏమిటి, వాటి వాక్యానుగుణ తాత్పర్యం ఏమిటి తెలుసుకోవలనేది నా తపన. ఇది ఇంకా తీరని సందేహమే.

ప్రకటనలు

7 వ్యాఖ్యలు to “దీని భావమేమి తిరుమలేశ?”

 1. sravan Says:

  Hi,
  Can you please send me this song audio link/ mail me mp3.
  Thank you,
  Sravan

 2. dvnsravan Says:

  Hi,
  Please listen to this lecture by Sri.Pappu Venugopalarao garu. This may give us some clues regd. this kriti.
  http://www.esnips.com/doc/432651d3-daed-45e9-9639-d59213db8c2d/4-8-Hari-Rasama-Vihari

  -Sravan

 3. dvnsravan Says:

  seenu garu,
  tiruvidhula midaggara , mangalampalli garu padina version unda ? unte dayachesi dvnsravan@gmail.com ki mail cheyyandi.
  -sravan

 4. సుధాకర బాబు Says:

  చాలా పాతపోస్టుకు ఇప్పుడు వ్యాఖ్య వ్రాస్తున్నాను క్షమించండి – ఈ కీర్తనకు అర్ధం అనుకోకుండా ఇంటర్నెట్ లోనే దొరికింది. (లింకు గుర్తులేదు కనుక మరోసారి వ్రాస్తాను)

  ఈ శ్లోకంలో దశావతారాలు ఇలా సూచింపబడ్డాయట –

  1. దయానిభృత (దయాంబర, దయానివృత?) తనుధారి – మత్స్యావతారం – దయ అనే పొలుసులచేత ఆవరింపబడినవాడు

  2. సంశయాతిశయ సంచారీ – కూర్మావతారం – సంశయం కలిగినపుడు (అమృత మధనం అంతరాయం అనిపించిపుడు) దాన్ని నివృత్తి చేసే తనువు ధరించినవాడు

  3. కయావ్యజిత వికారి – వరాహావతారం – వికార రూపాన్ని ధరించినవాడు

  4. క్రియా విముఖ కృపాణధారి – నరసింహావతారం – పనికిరాని కత్తి ధరించినవాడు (ఎందుకంటే ఆయన వజ్రనఖాలనే వాడుతాడు)

  5. సదా మిధ్యా జ్ఙానీ – వామనావతారం – దొంగ వటువుగా అవతరించినవాడు

  6. మదాలి మతాభిమానీ – పరశురామావతారం – క్షత్రియులను సంహరించి బ్రాహ్మణులకు ఆ స్థానాన్ని ఇచ్చినవాడు

  7. తదాశ్రిత సంధాని – రామావతారం – శరణాగత రక్షకుడు

  8. తదాతదా చింతాశయనాని – బలరామావతారం – అప్పుడపుడూ (మద్యం మత్తులో లేనపుడు) చింతాగ్రస్తుడయ్యేవాడు

  9. పరామృత సంపాదీ – కృష్ణావతారం – గీతామృతాన్ని బోధించినవాడు

  10. స్థిరానందాస్వేది- కల్క్యావతారం – శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవాడు

  వరాలాప వివాది – శ్రుతిగీతాగానాలచే ఆనందించేవాడు

  తిరువేంకటగిరి దివ్వ వినోది

  ఈ భావం రచయితకు వందనాలు. ఈ అర్ధాన్ని నేను ప్రింటు చేశాను. కాని రచయిత పేరు ఆ పేజీలో లేదు. లభించినపుడు ఆ విషయం కూడా వ్రాస్తాను.

 5. సుధాకర బాబు Says:

  ఇప్పుడే ఆ లింకు దొరికింది –
  http://www.telugubhakti.com/telugupages/Monthly/Keertanas/Keertanas.htm

  రచయిత శ్రీ ఐ.వి. సీతాపతిరావు – అన్నమాచార్యుల అమృత వర్షిణి

  • seenu Says:

   సుధాకర్ గారు, మీ దయా అని ఇన్నాళ్ళకు ఈ టపా కి మోక్ష విముక్తి కలిగింది! చాలా ధన్యవాదాలు! మీరు ఇచ్చిన లింక్ లో ఇంకెన్నో అద్భుతమైన కీర్తనా సారంసములు కూడా ఉన్నాయి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: