ఉబూంటు (లినక్స్) లో తెలుగు ఫాంట్స్

ఎట్టకేలకు ubuntu (నేను వాడే linux distro) లో తెలుగు fonts సరిగ్గా కనపడటానికి ఒక మార్గం తెలిసింది. ఉబూంటు లో ttf-telugu-fonts ఉన్నా fonts-cache లో అవి తెలుగు కి link అయ్యుండకపోవడం వల్ల అక్షరాలు తెలుగు లో కాకుండా ‘హెక్షరాలు ‘(hexadecimal) గా కనపడేవి. సూరజ్ కూరపాటి గారి ప్రమేయం తో ఈ సమస్య తాత్కాలికం గా పరిష్కరించబడినది. వివరాలకు ఈ పుట చూడండి.

ప్రస్తుతానికి ఇది temporary fix అని launchpad (bug tracker) లొ నివేదించబడింది. త్వరలో ఈ సమస్య కు permanent fix సమకూరాలని ఆశిస్తూ,

లినక్స్ లో తెలుగు లో నెట్ లో బ్లాగింగ్ చేస్తున్న ఓ వలయసంచారి.

Edit: ఇప్పుడు ఈ సమస్య కి శాశ్వత పరిష్కారం లభ్యమైనది – కేవలం ఒకే ఒక్క వాక్యం తో –

$ sudo apt-get install language-pack-te

మరిన్ని వివరాలకు ఈ పుట చూడండి.

ప్రకటనలు
Uncategorized లో రాసారు. Leave a Comment »