అద్వైతం

కన్యాశుల్కం లో “ఆనందం అర్ణవమైతే…” అనే పాట మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం లో ‘అద్వైతం’ కవితకి గేయరూపం అని నాకు ఇప్పుడే ఒక అద్భుతమైన website ద్వారా తెలిసింది. మహాప్రస్థానం లో నాకు బాగా నచ్చిన కవితల్లో అదొకటి – beautiful use of dichotomy – వ్యతిరేకాలు వాడి, రెండు భిన్న స్వరూపాల కలయిక తో ఎంతో ధీమాగా, సునాయాసంగా (శ్రీ శ్రీ శైలిలో) ప్రపంచాన్ని మార్చేద్దాం అంటారు మహాకవి. ఈ ద్వైవిద్యాన్నే అద్వైతం అని వర్ణిస్తారు. కన్యాశుల్కం ఇంతకు ముందు చూసినప్పుడు ఎప్పుడు నేను గమనించలేదు గాని, ఈ మాటలనే పాటగా మార్చారు (కరటక శాస్త్రి శిష్యుడికి ‘సుబ్బి’ వేషం వేసి లుబ్ధావుధానులకు ఇచ్చి పెళ్ళి చేసినప్పుడు ఆ పెళ్ళి వేడుకలలో మధురవాణి నాట్యప్రదర్శన). ఇక్కడ ఈ పాట వినవచ్చు (ఈ website లొ ఇంకెన్నొ పాత తెలుగు పాటలు పొందుపరచబడ్డాయి).

గుర్తు కోసం ఆ పద్యం నుంచి ఒక భాగం:

వాసంత సమీరం నీవై
హేమంత తుషారం నేనై
నీ ఎగిరిన జీవ విహంగం
నా పగిలిన మరణ మృదంగం
చిగురించిన తోటలలోనో,
చితులించిన చోటులలోనో,
వలయములై చలించినపుడే,
విలయములై జ్వలించినపుడే,
కాలానికి కళ్ళెం వేస్తాం,
ప్రేమానికి గొళ్ళెం తీస్తాం.

పూర్తి పద్యాన్ని ఇక్కడ చదవచ్చు.

ప్రకటనలు