అద్వైతం

కన్యాశుల్కం లో “ఆనందం అర్ణవమైతే…” అనే పాట మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం లో ‘అద్వైతం’ కవితకి గేయరూపం అని నాకు ఇప్పుడే ఒక అద్భుతమైన website ద్వారా తెలిసింది. మహాప్రస్థానం లో నాకు బాగా నచ్చిన కవితల్లో అదొకటి – beautiful use of dichotomy – వ్యతిరేకాలు వాడి, రెండు భిన్న స్వరూపాల కలయిక తో ఎంతో ధీమాగా, సునాయాసంగా (శ్రీ శ్రీ శైలిలో) ప్రపంచాన్ని మార్చేద్దాం అంటారు మహాకవి. ఈ ద్వైవిద్యాన్నే అద్వైతం అని వర్ణిస్తారు. కన్యాశుల్కం ఇంతకు ముందు చూసినప్పుడు ఎప్పుడు నేను గమనించలేదు గాని, ఈ మాటలనే పాటగా మార్చారు (కరటక శాస్త్రి శిష్యుడికి ‘సుబ్బి’ వేషం వేసి లుబ్ధావుధానులకు ఇచ్చి పెళ్ళి చేసినప్పుడు ఆ పెళ్ళి వేడుకలలో మధురవాణి నాట్యప్రదర్శన). ఇక్కడ ఈ పాట వినవచ్చు (ఈ website లొ ఇంకెన్నొ పాత తెలుగు పాటలు పొందుపరచబడ్డాయి).

గుర్తు కోసం ఆ పద్యం నుంచి ఒక భాగం:

వాసంత సమీరం నీవై
హేమంత తుషారం నేనై
నీ ఎగిరిన జీవ విహంగం
నా పగిలిన మరణ మృదంగం
చిగురించిన తోటలలోనో,
చితులించిన చోటులలోనో,
వలయములై చలించినపుడే,
విలయములై జ్వలించినపుడే,
కాలానికి కళ్ళెం వేస్తాం,
ప్రేమానికి గొళ్ళెం తీస్తాం.

పూర్తి పద్యాన్ని ఇక్కడ చదవచ్చు.

ప్రకటనలు

8 వ్యాఖ్యలు to “అద్వైతం”

 1. venkat Says:

  అద్వైతం ని ఆంగ్లంలోకి అనువదించే నా ప్రయత్నం http://www.24fps.co.in లో చదివి మీ అభిప్రాయం చెప్పండి.
  venkat
  http://www.24fps.co.in

 2. రాకేశ్వర రావు Says:

  నాకు చాలా చాలా చాలా చాలా నచ్చిన పద్యం అది.
  అలాగే మొన్ననే కన్యాశుల్కం కూడా చదివా…
  పి సుశీల గొంతులో ఈ పాట నిజంగా అమృతమే…
  చాలా చాలా కృతజ్ఞతలు!

 3. రాకేశ్వర రావు Says:

  @ venkat
  అద్వైతం ఆంగ్లంలో Swinburne కవి వ్రాసిన The Match కి చాలా సామీప్యంలో వుంటుందిగా.

 4. rajendra Says:

  శ్రీశ్రీ తెలుగు రచనల ఆంగ్లమూలాలు అన్వేషించటం మరో సారి ఆరంభమవటం బాగుంది,అలాగే ఫ్రెంచ్ మూలాలను వెతికే పుణ్యం కూడా ఎవరో ఒకరు కట్టుకోండి.మన అందరి సౌలభ్యంపరిశీలన కోసం A MATCH ఇక్కడ ఇస్తున్నాను.మిగిలిన వాటి సంగతేమో గాని,కాదేది కవితకనర్హం అనే వాక్యానికి ముక్కస్యముక్కాయ ఇంగ్లీష్ వాక్యం ఒకటి నేను చూసాను.కానీ ఆ ఆంగ్లకవి శ్రీశ్రీ కన్నా చాలా ముందరి వాడు.

  A MATCH

  IF love were what the rose is,
  And I were like the leaf,
  Our lives would grow together
  In sad or singing weather,
  Blown fields or flowerful closes
  Green pleasure or grey grief ;
  If love were what the rose is,
  And I were like the leaf.

  If I were what the words are,
  And love were like the tune,
  With double sound and single
  Delight our lips would mingle,
  With kisses glad as birds are
  That get sweet rain at noon ;
  If I were what the words are,
  And love were like the tune.

  If you were life, my darling,
  And I your love were death,
  We ‘d shine and snow together
  Ere March made sweet the weather
  With daffodil and starling
  And hours of fruitful breath ;
  If you were life, my darling,
  And I your love were death.

  If you were thrall to sorrow,
  And I were page to joy,
  We ‘d play for lives and seasons
  With loving looks and treasons
  And tears of night and morrow
  And laughs of maid and boy ;
  If you were thrall to sorrow,
  And I were page to joy.

  If you were April’s lady,
  And I were lord in May,
  We ‘d throw with leaves for hours
  And draw for days with flowers,
  Till day like night were shady
  And night were bright like day ;
  If you were April’s lady,
  And I were lord in May.

  If you were queen of pleasure,
  And I were king of pain,
  We ‘d hunt down love together,
  Pluck out his flying-feather,
  And teach his feet a measure,
  And find his mouth a rein ;
  If you were queen of pleasure,
  And I were king of pain.

 5. osteofsvept Says:

  If you are a real estate professional, be really careful in dealing with KoRes Corp. in Weston Florida. Tulio Rodriguez & Monica Cataluna-Shand are shysters and look for anyway to steal ones customers. They attempt to steal your client by requesting their contact information and later contact them behind your back to get them to deal with them directly.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: